300 మందికి పైగా మోటర్ సైక్లిస్టుల ర్యాలీ

- December 20, 2021 , by Maagulf
300 మందికి పైగా మోటర్ సైక్లిస్టుల ర్యాలీ

బహ్రెయిన్: బహ్రెయిన్ మోటర్ సైకిల్ క్లబ్ (బిఎంసి) సభ్యులు ప్రత్యేక మార్చ్ (ర్యాలీ) నిర్వహించారు బహ్రెయిన్ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో. ఈ సందర్భంగా బిఎంసి అధ్యక్షుడు ఇస్సా అల్ అవాది, బహ్రెయిన్ రాజు అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా , క్రౌన్ ప్రిన్స్, తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్ సాయా స్క్వేర్ కాంప్లెక్స్ నుంచి ఈ నేషనల్ మార్చ్ ప్రారంభమైంది. వివిధ క్లబ్బులు, గ్రూపుల నుంచి పెద్ద సంఖ్యలో మోటర్ సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బహ్రెయిన్ జాతీయ పతాకాన్నీ, బహ్రెయిన్ రాజు ఫొటోనీ చేత పట్టి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 300 మందికి పైగా మోటర్ సైక్లిస్టులతో ర్యాలీ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com