ఒమిక్రాన్ వేగం..న్యూఇయర్ వేడుకలపై కొరడా
- December 21, 2021
కర్ణాటక: భారత్ లో ఒమిక్రాన్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడాన్ని నియంత్రిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. డీజేలు లేకుండా క్లబ్లు, రెస్టారెంట్లలో 50 శాతం కెపాసిటీతో మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. కోవిడ్ -19 టీకాలు వేసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది.వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. కాగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని ఇంటర్ సెక్షన్ మూసివేత..!!
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు







