ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిఎ ఇబ్రహీం హాజి మృతి
- December 21, 2021
దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నడాక్టర్ పిఎ ఇబ్రహీం మాజి తుది శ్వాస విడిచారు. యూఏఈలో 55 ఏళ్ళపాటు వున్నారాయన. అనారోగ్య కారణాలతో కోజికోడ్‌లోని మిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.డిసెంబర్ 20న ఆయన్ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకి తరలించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించడం జరిగింది. కేరళలో జన్మించిన డాక్టర్ హాజి, మలబార్ గ్రూప్ కో-ఛైర్మన్ అలాగే పేస్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్‌గా పని చేశారు. ఇండస్ మోటార్ కంపెనీ వైస్ ఛైర్మన్ అలాగే వ్యవస్థాపకుడాయన. మలబార్ గోల్డ్ సంస్థ కో-ఛైర్మన్ మరియు ముఖ్యమైన పెట్టుబడిదారుగా వున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







