తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు
- December 21, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకమునుపే..కొత్త వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు మొదటి స్థానంలో కొనసాగుతుంటే..తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది. తెలంగాణలో 20 కేసులుంటే..తాజాగా..మరో నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ రకం కరోనా కేసులు యూరప్, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతుండం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే, రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
తాజా వార్తలు
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు
- సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!







