యూఏఈ గ్రీన్ పాస్ ప్రోటోకాల్: ఉచిత టెస్టింగ్ సేవలు, అర్హులెవరంటే..
- December 21, 2021
యూఏఈ: జనవరి 3 నుంచి అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ వున్న ఉద్యోగులు మరియు సందర్శకుల్ని మాత్రమే ఫెడరల్ గవర్నమెంట్ కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు యూఏఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా అదనంగా మరిన్ని నిబంధనల్ని విడుదల చేశారు. క్రిస్‌మస్ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేవారికి సంబంధించి ప్రోటోకాల్స్ విడుదల చేశారు. గ్రీన్ పాస్ వుంటేనే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతి వుంటుంది. గ్రీన్ పాస్ పొందాలంటే, యూఏఈలో అనుమతి పొందిన ఏదైనా వ్యాక్సిన్‌కి సంబంధించి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలి.రెండో డోస్ తర్వాత ఆరు నెలల సమయం అయితే, బూస్టర్ డోస్ తప్పక తీసుకోవాలి. ప్రతి 14 రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ తీసుకోవడం ద్వారా గ్రీన్ స్టేటస్ యాక్టివ్‌గా వుంచుకోవచ్చు. కోవిడ్ 19 టెస్టింగ్ సేవలు ఉచితం. అయితే, ఉచిత టెస్టింగ్ పొందడానికి యూఏఈ జాతీయులై వుండాలి. 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు, 50 ఏళ్ళు పైబడిన నివాసితులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సేవ ఉచితం. 8001717 నెంబరు ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సెహా యాప్ ద్వారా కూడా ఉచిత టెస్టింగ్ అపాయింట్మెంట్ పొందవచ్చు. యూఏఈ జాతీయులు, ఎమిరేటీ మహిళల పిల్లలు, ఎమిరేటీ హౌస్‌హోల్డ్స్ ఇళ్ళలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్లు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, 50 ఏళ్ళు పైబడిన నివాసితులు, పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్, గర్భిణీ స్త్రీలు సెహా యాప్ ద్వారా అపాయింట్మెంట్ పొందాల్సి వుంటుంది. ఎంపిక చేసిన కోవిడ్ 19 టెస్టింగ్ కేంద్రాల్లో విద్యార్థులు పీసీఆర్ టెస్టులు పొందవచ్చు. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అలాగే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు టెస్టులు చేయించుకోవచ్చు. కేవలం విద్యార్థులకు మాత్రమే నేరుగా పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







