మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం

- December 24, 2021 , by Maagulf
మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం

బహ్రెయిన్: బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్, మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా సమయానికి 10 నిమిషాల ముందుగా మసీదులు తెరవబడుతాయి. ప్రార్థనలు ముగిసిన తర్వాత 10 నిమిషాలకు మసీదుల్ని మూసివేస్తారు. కోవిడ్ 19 సంబంధిత లక్షణాలు ఏవైనా వుంటే, మసీదులకు వెళ్ళవద్దని మినిస్ట్రీ సూచించింది. ప్రార్థనలు చేసేవారు పక్కనున్నవారితో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. సొంతంగా రగ్గులు తెచ్చుకోవాలి. మసీదుల ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు అందిస్తారు. ఫేస్ మాస్క్ లేకపోతే మసీదుల్లోకి ప్రవేశం వుండదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com