భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకు గవర్నర్ తేనీటి విందు
- December 26, 2021
ఏపీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ కు విచ్చేసారు.ఎన్.వి రమణ, శివమాల దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఘనంగా స్వాగతం పలకగా, సిజె పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.అప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , సతీమణి భారతి రాజ్ భవన్ కు చేరుకోగా, ముఖ్యమంత్రి సిజెకు ఎదురేగి రాజ్ భవన్ దర్బార్ హాలులోకి తోడ్కొని వచ్చారు. తొలుత రాజ్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జెకె మహేశ్వరి దంపతులు సుప్రీం సిజె తో కలిసి వచ్చారు. దర్బారు హాలులో గౌరవ గవర్నర్ తో భేటీ అయిన సుప్రీం సిజె సమకాలీన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో శాసనపరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అదనపు కార్యదర్శులు ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ నివాస్, సిపి కాంతి రాణా టాటా, ఐఎఎస్ అధికారులు కృతికా శుక్లా, షన్ మోహన్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ ఉపకార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా గవర్నర్, సిఎం, న్యాయమూర్తులతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గ్రూపు ఫోటో దిగారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







