జిసిసి వలసదారులకు యూఏఈ ఇ-వీసా తప్పనిసరి

- March 25, 2016 , by Maagulf
జిసిసి వలసదారులకు యూఏఈ ఇ-వీసా తప్పనిసరి

జిసిసి వలసదారులు యూఏఈలోకి ప్రవేశించలంటే ఆన్‌లైన్‌ ఇ-వవీసా తప్పనిసరి. మార్చ్‌ 29 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రయాణీకులకు, ట్రావెల్‌ ఏజెంట్లకు యూఈఏ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్పష్టమైన సమాచారం పంపించారు. కొన్ని వర్గాలకు చెందిన జీసీసీ వలసదారులకు వీసా ఆన్‌ ఎరైవల్‌ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా నిబంధన ప్రకారం ఆన్‌లైన్‌లో ఈ-వీసాను ముందే పొందాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్‌ స్పష్టం చేసింది. పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. మస్కట్‌లోని ఎయిర్‌ అరేబియా అధికారులు మాత్రం ఈ విషయమై తమకు సమాచారం లేదన్నారు. తాజా నిబంధనల ప్రకారం యూఏఈ వీసా పొందే జిసిసి నివాసితుడికి ఎంట్రీ పర్మిట్‌ 30 రోజుల వరకు ఉంటుంది, ఎంట్రీ అయ్యాక 30 రోజులపాటు ఇది చెల్లుబాటు అవుతుంది. దీన్ని 60 రోజుల వరకు పెంచుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com