దోహా ఫైర్ స్టేషన్లో డొమెస్టిక్ ఎఫైర్స్
- March 25, 2016
దోహా ఫైర్ స్టేషన్, 'డొమెస్టిక్ ఎఫైర్స్' పేరుతో ట్రావెలింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ - గ్యారేజ్ గ్యాలరీని అంతర్జాతీయ స్థాయి ప్రముఖ ఆర్టిస్టులతో ఏర్పాటు చేసింది. మే 15 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఖతార్ మ్యూజియమ్స్ ఛైర్ పర్సన్ షేకా అల్ మయాస్సా బింట్ అహమాద్ బిన్ ఖలీఫా అల్ థని మార్గదర్శకత్వంలో ఇది ఏర్పాటయ్యింది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఖతార్ (విసియు ఖతార్) మరియు కల్చరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బ్యూరో యూరోపా భాగస్వామ్యంతో ఈ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. దోహా ఎడిషన్‌లో లోకల్ డిజైనర్స్ రూపొందించిన పలు ఉత్పత్తులను పొందుపరిచారు. కోలోన్, జర్మనీ మరియు చైనాలోని షెన్జన్లో ఈ డొమెస్టిక్ ఎఫైర్స్‌ని ఎగ్జిబిట్ చేశారు. ఇల్లు అంటే ఇటుకలు, మోర్టార్, ఫైనాన్షియల్ ఎస్సెట్, కొన్ని గృహోపకరణాలు, టెక్నాలజీ మాత్రమే కాదనీ, ఇది స్టేట్ ఆఫ్ మైండ్‌ని నిర్వచిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఫైర్ స్టేషన్ డైరెక్టర్ ఖలీఫా అల్ ఒబైద్లీ మాట్లాడుతూ, దేశీయ సంస్కృతి, సృజనాత్మక శైలి ఇవన్నీ ఈ ఎగ్జిబిషన్ ద్వారా బయటకు వస్తాయని అన్నారు. 1982లో దోహా ఫైర్ స్టేషన్ ఏర్పాటయ్యింది. 2012 తర్వాత ఖతార్ మ్యూజియమ్‌కి దీన్ని అప్పగించారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







