టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్...
- December 27, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగనే.. భారీ బందోబస్తు నడుమ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఎర్రవల్లి రైతులతో రచ్చబండకు వెళ్తుండగా రేవంత్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బలవంతంగా రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ దగ్గర రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని పోలీసులు తోసేశారు. కింద పడడడంతో మల్లు రవికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో మల్లు రవి చొక్క చినిగిపోయింది. మల్లు రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెళ్లికి వెళ్తానని, అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!