మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కే.టి.ఆర్

- December 27, 2021 , by Maagulf
మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కే.టి.ఆర్

హైదరాబాద్:  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ  పరిశ్రమల శాఖ మంత్రి  కే.టి.ఆర్ ఓవైసీ మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్ ఫ్లై ఓవర్ ను మంగళవారం ప్రారంభించనున్నారు.హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా గుర్తింపు తేవాలనే తలంపు వినూత్న పథకాల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పలు అభివృద్ది పనులు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. విస్తరిస్తున్న మహానగరంలో ప్రజలకు  మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు  కల్పించేందుకు జిహెచ్ఎంసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.

నగరానికి దక్షిణ భాగంలో ఉన్న పాత బస్తీ ప్రాంతంలో ప్రజల మౌలిక వసతులు,  ప్రధాన  కూడళ్లలో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలరద్దీ క్రమబద్దీకరణ నేపథ్యంలో వ్యూహాత్మక  పథకాల ద్వారా రోడ్ల వెడల్పు, జంక్షన్ అభివృద్ది సుందరీకరణ పనులు చేపడుతున్నారు.

  అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వయా దక్షణ ప్రాంతం నుండి సులువుగా తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా వెళ్లేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపడుతున్నారు.మినీ రింగు రోడ్డుగా పిలువబడే ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వరకు  గల రోడ్డు మార్గంలో ఫ్లైఓవర్ లు అండర్ పాసులు SRDP మొదటి దశలో నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులో తేనున్నారు.

ఈ నేపథ్యంలో మిధాని నుండి ఓవైసీ జంక్షన్ వరకు రూ. 63 కోట్ల అంచనా వ్యయంతో 1.36కిలోమీటర్ల గల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు. దీన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంగళవారం లాంచనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.
ఈ ఫ్లై ఓవర్ ఫ్రీ క్యాస్ట్ టెక్నాలజితో నిర్మించారు. నగరంలో దక్షణ ప్రాంతంలో మొట్ట మొదటి బ్రిడ్జి  నిర్మాణ వ్యయం రూ. 63 కోట్లు కాగా భూసేకరణ యుటిలిటీ నష్టపరిహారం కింద మారో రూ. 17 కోట్లు వెచ్చించినందున ఈ ప్రాజెక్టు మొత్తం రూ. 80 కోట్ల ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులోకి  తేనైనది. ఫ్లైఓవర్ పైన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు లైన్లతో ఒకే మార్గంతో  నిర్మాణం చేపట్టారు. కాంక్రీట్ తోనే ఫౌండేషన్ పనులు చేపట్టిన మిగతా ఫ్రీ క్యాస్ట్ టెక్నాలజీ ని ఉపయోగించినట్లు  ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాల రద్దీ నియంత్రణ, పొల్యూషన్ నివారణ చర్యలు తీసుకున్నట్లు సి.ఈ  దేవానంద్  వెల్లడించారు.

SRDP పథకంలో మొత్తం 7 ప్రాజెక్టులు ఎస్.ఆర్.డి.పి పథకం మొదటి దశలో  ఆరాంఘర్ నుండి  ఎల్.బి నగర్ వరకు సులువుగా ప్రయాణించేందుకు మొత్తం 7 ప్రాజెక్టులు చేపట్టారు. అందులో 5 ఫ్లై ఓవర్ల లో ఓవైసీ ఫ్లై ఓవర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఒకటి అండర్ పాస్, మరొకటి  అర్.ఓ.బి పనులను నల్గొండ ఓవైసీ కారిడార్ ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు, బహదూర్ పుర , అరంఘర్ నుండి జూ పార్క్ కారిడార్ ఫ్లై ఓవర్ ఫలక్ నామ, ఆర్.ఓ.బి  ఉప్పుగూడ  ఆర్.యు.బి చేపట్టిన పనులు మార్చి 2022 వరకు  పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు సి.ఈ  తెలిపారు.

మంగళవారం ప్రారంభించే ఓవైసీ ఫ్లై ఓవర్ కార్యక్రమంలో కే.టిఆర్ తో పాటుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సబితాఇంద్ర రెడ్డి, దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు కేశవరావు, ఎంపిలు అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి, శాసన మండలి సభ్యులు సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ,  మీర్జా రియాజుల్ ఎఫెంది, యెగ్గే మల్లేశం, సురభి వాణీ దేవి, శాసన సభా సభ్యులు  అక్బరుద్దీన్ ఓవైసీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీధర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేట్లు మిర్జా ముస్తఫా బేగ్, వంగా మధుసూధన్ రెడ్డి, రేష్మ ఫాతిమా, మొహమ్మద్ ముజ ఫర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com