ఈ ఏడాది 1,520 ఫుడ్ కోర్టులకు నోటీసులు ఇచ్చిన దోహా మునిసిపాలిటీ

- December 28, 2021 , by Maagulf
ఈ ఏడాది 1,520 ఫుడ్ కోర్టులకు నోటీసులు ఇచ్చిన దోహా మునిసిపాలిటీ

ఖతార్: ఈ సంవత్సరం దోహా, పారిశ్రామిక ప్రాంతంలోని ఫుడ్ అవుట్‌లెట్‌లు, రిటైల్ షాపులపై దోహా మునిసిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం 36,917 తనిఖీ చేసింది. ఆహార నియంత్రణ 1990 చట్టం 8 ప్రకారం.. నిబంధనలు పాటించని 1,520 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. 177 ఆహార దుకాణాలను మూసి వేయించారు. ఇంకా 1,763 ఆహార నమూనాలు వాటి భద్రత, నిర్ణీత ప్రమాణాలను నిర్ధారించడానికి ల్యాబ్ కు పంపారు. ఈ విభాగం 2,763 అవుట్‌లెట్‌లలో ఆహార కార్మికులకు నిబంధనల పట్ల అవగాహన కల్పించింది. తనిఖీల్లో భాగంగా కార్నిచ్ ఫిష్ మార్కెట్‌లో 351 టన్నుల చేపలను పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగానికి పనికిరాని 730 కిలోల చేపలను సీజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com