వాణిజ్య సంస్థలు, మాల్స్ ల్లో ప్రవేశించడానికి బార్‌కోడ్ స్కానింగ్
- December 28, 2021
సౌదీ: వాణిజ్య సంస్థలు, మాల్స్ ల్లో ప్రవేశించడానికి కొత్తగా బార్‌కోడ్ స్కానింగ్ ఎంట్రీ మెకానిజమ్ ను ప్రవేశపెట్టినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ అల్-హుస్సేన్ తెలిపారు.
ప్రతి వాణిజ్య సంస్థ తన ప్రవేశ ద్వారం వద్ద ఆటోమేటిక్ హెల్త్ స్టేటస్ వెరిఫికేషన్ పర్మిట్‌ల కోసం కోడ్‌ను అందించాల్సి ఉంటుందని అల్-హుస్సేన్ చెప్పారు. వాణిజ్య సంస్థలు ఉద్యోగులకు స్కానింగ్కోడ్ కేటాయించవలసి ఉంటుందని, తవక్కల్నా అప్లికేషన్ లో వారి ఆరోగ్య స్థితిని తనిఖీ చేయడానికి బార్‌కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుందని అల్-హుస్సేన్ తెలిపారు. రిటైల్ రంగంలోని కిరాణా, లాండ్రీలు, బార్బర్ షాపులు, టైలరింగ్ షాపుల వంటి అన్ని చిన్న దుకాణాలను కూడా ఇందులో చేర్చినట్లు ఆయన స్పష్ట చేశారు. ఈ కొత్త వెరిఫికేషన్ మెకానిజం సర్వీస్ వాణిజ్య సంస్థలు, మాల్స్‌లో కరోనావైరస్ను నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడంలో సహాయపడుతుందని అల్-హుస్సేన్ తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







