ఈ ఏడాది 1,520 ఫుడ్ కోర్టులకు నోటీసులు ఇచ్చిన దోహా మునిసిపాలిటీ
- December 28, 2021
ఖతార్: ఈ సంవత్సరం దోహా, పారిశ్రామిక ప్రాంతంలోని ఫుడ్ అవుట్లెట్లు, రిటైల్ షాపులపై దోహా మునిసిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం 36,917 తనిఖీ చేసింది. ఆహార నియంత్రణ 1990 చట్టం 8 ప్రకారం.. నిబంధనలు పాటించని 1,520 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. 177 ఆహార దుకాణాలను మూసి వేయించారు. ఇంకా 1,763 ఆహార నమూనాలు వాటి భద్రత, నిర్ణీత ప్రమాణాలను నిర్ధారించడానికి ల్యాబ్ కు పంపారు. ఈ విభాగం 2,763 అవుట్లెట్లలో ఆహార కార్మికులకు నిబంధనల పట్ల అవగాహన కల్పించింది. తనిఖీల్లో భాగంగా కార్నిచ్ ఫిష్ మార్కెట్లో 351 టన్నుల చేపలను పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగానికి పనికిరాని 730 కిలోల చేపలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







