పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..పండగల వేళ 11,500 విమానాలు రద్దు
- December 28, 2021
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్.
క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులతో విమానాశ్రయాలు రద్దీగా ఉంటాయి. ఒమిక్రాన్ భయంతో గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 11,500 విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది.
యూరోప్, అమెరికాలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. 11వేలకు పైగా విమానాలు రద్దవటమే కాకుండా వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒమిక్రాన్ భయంతో సిబ్బంది విధులకు హాజరు కాకపోవటం కూడా విమానాల రద్దుకు ఒక కారణంగా తెలుస్తోంది.
ఫ్లయిట్ ట్రాకర్ ఫ్లయిట్ అవేర్ లెక్కల ప్రకారం సోమవారం ముడు వేల విమానాలు రద్దయ్యాయి. ఈ రోజు మరో 1100 విమానాలు రద్దు చేశారు. అమెరికాలో పరిస్ధిత మరీ దారుణంగా ఉంది. ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటంతో లేబర్ షార్టేజ్ ఏర్పడింది. దీంతో అమెరికా అంటువ్యాధుల విభాగం కొత్త నిర్ణయం తీసుకుంది. కోవిడ్ లక్షణాలు లేని కేసుల్లో హోం ఐసోలేషన్ వ్యవధిని తగ్గించింది. ఐసోలేషన్ గడువును 10 రోజులనుంచి ఐదు రోజులకు తగ్గించింది.
ఐరోపాలో వ్యాక్సినేషన్ సంఖ్య పెంచటానికి కృషి చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే ఎక్కువమంది వ్యాక్సినే వేయించుకోని వారే అని తేలింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగటంతో అవసరమైన చోట ఉద్యోగులను వారానికి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని మంత్రులు పిలుపు నిచ్చారు.
మరో వైపు కరోనా పుట్టిన చైనా లోని జియాన్ లో కోవిడ్ వ్యాప్తి నిరోధనాకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి లో జరిగే బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు కోవిడ్ నియంత్రించేందుకు అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో తనిఖీలు, ప్రజలు ఇళ్లకే పరిమితమవటం వంటి వాటిని అమలు చేస్తున్నారు. జియాన్‌లో 13 మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈనిబంధనలు సోమవారం నుంచి మరింత కఠినతరం చేశారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!







