మెగా హీరో యాక్సిడెంట్ కేస్.. త్వరలో ఛార్జ్‌షీట్
- December 28, 2021
హైదరాబాద్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కమిషన్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం.
లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ తదితర వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకే త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం అని సీపీ వెల్లడించారు.
కాగా,సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వెళుతున్న సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారు.. దాదాపు నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. ప్రస్తుతం సాయితేజ్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







