కోవిడ్ 19: హమాద్ మెడికల్ కార్పొరేషన్ కఠిన నిబంధనలు
- December 28, 2021
ఖతార్: హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకోసం అన్ని ఆసుపత్రుల్లోని వివిధ సౌకర్యాల వద్ద ఖచ్చితమైన నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ 19 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ సందర్శకుల్ని అనుమతించరు. కమ్యూనికబుల్ డిసీజ్ సెంటర్, ఫీల్డ్ హాస్పిటల్ - హజమ్ మెబైరీక్, జనరల్ హాస్పిటల్ అలాగే క్యుబాన్ హాస్పిటల్‌లో ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి. నాన్ కోవిడ్ ఫెసిలిటీస్ వద్ద కూడా ప్రత్యేకంగా సందర్శకుల కోసం ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పబ్లిక్ సందర్శించే అవకాశం వుంటుంది. సందర్శకులు గ్రీన్ స్టేటస్ చూపించాలి. ఒక్కో విజిటర్ అత్యధికంగా 15 నిమిషాలు మాత్రమే వుండడానికి వీలుంది. ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అత్యధికంగా విజిటింగ్ అవర్స్ సమయంలో అనుమతినిస్తారు. ఎస్కార్ట్ సౌకర్యం వుండదు. ఆహారం, పువ్వులు, డ్రింక్స్ మరియు చాక్లెట్స్ వంటివాటిని అనుమతించరు. 15 ఏళ్ళ లోపువారికి కూడా అనుమతి లేదు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







