‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన హీరో టోవినో థామస్
- December 29, 2021
కేరళ: ‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ.సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్.ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా,తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ లు అతిధులుగా విచ్చేశారు.
ఇక తాజాగా నేడు కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా..ఈ ఈవెంట్ కి మలయాళ హీరో టోవినో థామస్ అతిథిగా హాజరయ్యారు.ఇటీవలే టోవినో మిన్నల్ మురళి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.లోకల్ సూపర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఏది ఏమైనా ప్రమోషనలయందు జక్కన్న ప్రమోషనలు వేరయా.. అని ఊరికే అనరు..తమ హీరోల ఫ్యాన్స్ తో పాటు అక్కడి హీరోల ఫ్యాన్స్ ని కూడా రాబట్టుకోవడానికి జక్కన్న వేసిన ప్లాన్ సూపర్ అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







