ప్రధాని మోదీ మొదటి విదేశీ పర్యటన వాయిదా..
- December 29, 2021
న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ మొదటి విదేశీ పర్యటన క్యాన్సిల్ అయ్యింది.వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ప్రధామంత్రి నరేంద్రమోదీ యూఏఈ వెళ్లాల్సి ఉంది. కానీ ఒమిక్రాన్ భయం కారణంగా ప్రధాని యూఏఈ పర్యటన వాయిదా పడింది.ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోండటంతో ఈ పర్యటన వాయిదా వేసినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.భారత్-యూఏఈ మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన ఖరారు చేశారు అధికారులు.2022లో ఇదే ప్రధాని తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం.ఒకవేళ పర్యటనకు వెళ్తే, దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధాని మోదీ పాల్గొనేవారు.వాతావరణం, జీవవైవిధ్యం, అంతరిక్షం, పట్టణ, గ్రామీణ అభివృద్ధి,ప్రపంచలక్ష్యాలు,ఆరోగ్యం,ఆహారం,వ్యవసాయం,జీవనోపాధిపై యూఏఈతో మోదీ చర్చలు జరపాల్సి ఉంది.ఇంతకుముందు 2015, 2018, 2019లో యూఏఈని సందర్శించారు ప్రధాని మోదీ.యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్‌ను కూడా స్వీకరించారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషి యూఏఈ ఈ పురస్కారంతో సత్కరించింది.ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్-2, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మరికొందరు ప్రపంచనేతలకు ఈ అవార్డును ప్రదానం చేశారు యూఏఈ పాలకులు. భారత్‌తో యూఏఈకి మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి.భారత్‌కు యూఏఈ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







