'రాజా చేయివేస్తే' సినిమా ఆడియో విడుదల చేసిన చంద్రబాబు
- March 25, 2016
రాజా చేయివేస్తే సినిమా మంచి విజయం సాధించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ఈ రోజిక్కడ జరిగిన ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సినిమా ఫంక్షన్ కు బాలయ్య రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ నందమూరి తారకరామారావు గారి పేరు తలచుకోకుండా ఉండటం సాధ్యం కాదని అన్నారు. ఈ సినిమా హీరో నారా రోహిత్ వరుస సినిమాలతో బాణంలా దూసుకుపోతున్నారని చంద్రబాబు అన్నారు. తమ కుటుంబానికి రాజకీయం, సినిమాలతో అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. ఈ సినిమాలో నందమూరి తారక్ విలన్ గా నటించడం సంతోషం అన్నారు. ఎంతో బిజీగా ఉన్నా ఈ సినిమా ఫంక్షన్ కు వచ్చానని చెప్పిన చంద్రబాబు ఈ రోజు చాలా కీలకమైన మూడు విషయాలు జరిగాయన్నారు.
ఈ రోజు తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లానని, అక్కడే ఒక స్థూపం చూశానని దానిని బట్టి 700 ఏళ్ల కిందట రాణీ రుద్రమదేవి పట్టాభిషిక్తురాలైన రోజు ఇది అన్నారు. మన రాజధాని నగర నిర్మాణాలు ఎలా ఉండాలో డిజైన్లను చూశామన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









