బహ్రెయిన్ లో అమల్లోకి వచ్చిన 10% వ్యాట్
- January 02, 2022బహ్రెయిన్: బడ్జెట్ లోటును అదుపులో పెట్టేందుకు పెంచిన వ్యాట్ అమల్లోకి వచ్చింది. చట్టం ప్రకారం పన్ను విధించబడే అన్ని వస్తువులపై పెరిగిన 10% విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చెల్లుబాటు అవుతుంది. బడ్జెట్ లోటును అరికట్టడానికి, కోవిడ్ 19 ద్వారా ప్రభావితమైన ఫిస్కల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌ను తిరిగి స్థిరీకరించడానికి బహ్రెయిన్ పన్ను రేటును పెంచింది. రెండు సంవత్సరాల తర్వాత వ్యాట్ రేట్లలో సవరణలు జరిగాయి. ప్రాథమిక ఆహారం, కొత్త భవనాల నిర్మాణం, చమురు, గ్యాస్, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర వాటికి VAT నుండి మినహాయింపు ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ తో పాటు కొన్ని ఆర్థిక సేవలు వ్యాట్ పెంపుతో ప్రభావితం కావు. జనవరి 1, 2022లోపు సరఫరా చేయబడిన ప్రామాణిక-రేటెడ్ వస్తువులు, సేవలకు 5%(పాత రేటు) VAT రేటు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ