"మొలకల చాట్"
- March 25, 2016
పిల్లలకి కాస్త రుచిగా మరియు పౌష్టిక విలువలు అందించే "మొలకల చాట్" తయారీచూద్దాం..
కాలవసిన పదార్ధాలు:
పెసర మొలకలు - 1 కప్పు
నూనె
ఆవాలు - 1/4 టీ స్పూను
జీలకర్ర - 1/4 టీ స్పూను
కరివేపాకు - కొన్ని రెమ్మలు
ఉల్లి ముక్కలు - 1/4 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను
కారం
పసుపు - చిటికెడు
ధనియాలు, జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను
ఉప్పు
సర్వింగ్ కోసం:
చిలికిన తాజా పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు
ఉల్లి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
టమాటా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
కారం
తయారు చేయు విధానం:
1. బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
2. ఇవి చిటపటమన్న తరువాత కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాలు జీలకర్ర పొడి, టమాటా, మొలకలు,పావుకప్పు నీళ్ళు, ఉప్పు వేసి మీడియం మంట మీద మొలకలు మధ్యస్తంగా ఉడికేవరకు 5 నిమిషాలుకలుపుతూ వేయించాలి.
4. తర్వాత పొయ్యి మీద నుంచి దింపి చల్లారనివ్వాలి. ఈ మిక్చర్ ని రెండు సమ భాగాలు చేయాలి.
5. ఒక భాగాన్ని గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు వేసి కొద్దిగా ఉప్పు చల్లి 1 టేబుల్‌స్పూను ఉల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూను టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు,చిటికెడు కారం వేసి కలిపి సర్వ్ చేయాలి.
6. రెండో సగ భాగం కూడా పైవిధంగానే చేసి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









