ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త...
- March 25, 2016
ఈ ఏడాది 20వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో వెల్లడించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా తొలిదశ కింద 7వేల పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థికశాఖ ప్రతిపాదనలు తయారు చేసి ఈనెల 18న జరిగిన మంత్రివర్గం సమావేశం ముందుంచింది. అయితే ఆరోజు సమయాభావం కారణంగా ఈ అంశంపై చర్చించలేదని తెలిసింది. వచ్చే సమావేశంలో దీనిపై విధాన నిర్ణయం తీసుకుని భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని మొత్తం పోస్టుల సంఖ్య దాదాపు 4.50 లక్షలు కాగా అందులో 80 వేల దాకా ఖాళీలున్నట్లు సమాచారం. ఇందులో అత్యధికభాగం 4వ తరగతి ఉద్యోగులవేనని అధికారవర్గాలు తెలిపాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అధ్యాపకుల్లాంటి ఉన్నతస్థాయి పోస్టులు దాదాపు 20 వేల దాకా ఖాళీగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు.ఇందులో 7వేల పోస్టులను తొలి దశలో భర్తీ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ వయస్సును పెంచడంతో గత రెండేళ్లలో రిటైర్మెంట్లు ఆగిపోయాయి. పెంచిన గడువు ఈ యేడాది జూన్ 8తో ముగియనుంది. ఆ తర్వాత సుమారు 10 వేల మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







