ఒకే ఏడాది 18వేల మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 02, 2022
కువైట్ సిటీ: కువైట్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 18వేలకు పైగా మందిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం 2021లో మొత్తం 18,221 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. వీరందరూ వలసదారుల విషయమై చేసిన వివిధ చట్టాలను ఉల్లంఘించినట్లు మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. ఇక దేశ బహిష్కరణకు గురైన 18,221 మంది ప్రవాసుల్లో 11,177 మంది పురుషులు, 7,044 మంది మహిళలు ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







