వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 02, 2022
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌజ్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడారు. బహ్రెయిన్ ఎల్లో లెవెల్ కోవిడ్-19 ప్రోటోకాల్ ను జారీ చేసినందున ఆ మేరకు భద్రతా చర్యలను అనుసరించాలని కమ్యూనిటీ సభ్యులను కోరారు.
డానా మాల్ లోని IVS సెంటర్, EolBhCONNECT యాప్ పనితీరును సమీక్షించారు. ఇటీవల బహ్రెయిన్ పోస్ట్ ఆఫీస్ లలో అందుబాటులోకి వచ్చిన రెసిడెంట్ పర్మిట్ స్టిక్కర్ల గురించి కూడా శ్రీవాస్తవ కమ్యూనిటీ సభ్యులకు తెలియజేశారు. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మద్దతు ఇచ్చినందుకు స్థానిక ప్రభుత్వ అధికారులు, భారతీయ సంఘాలు, ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, బుదయ్య గురుద్వారాలకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలలకు పైగా బహ్రెయిన్లో చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారులు ఈ వారం ఇండియా కు వెళ్లారని, అలాగే మణి కొంబన్, శశిధరన్ పుల్లోట్, అర్ష్ ప్రీత్ కౌర్లపై విధించిన ట్రావెల్ నిషేధం ఎత్తేయడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని రాయబారి సమావేశంలో వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







