వరదల నేపథ్యంలో కువైట్లో స్కూళ్లకు సెలవు
- January 03, 2022
కువైట్: వరదల నేపథ్యంలో కువైట్లో స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు.10, 11 తరగతుల విద్యార్థులతో పాటు మిడిల్ స్కూల్ స్థాయిలలో సోమవారం జరగాల్సిన అన్ని ఫైనల్ పరీక్షలను రద్దు చేశారు. వాటిని ఒక రోజు తర్వాత నిర్వహించనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లో చాలా వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున, భారీ వర్షాల కారణంగా వరదలు, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పరీక్షల షెడ్యూల్ను మార్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ అల్-యాకూబ్ ఆదివారం తెలిపారు. పరీక్ష రోజు COVID-19 వ్యాప్తిని అరికట్టే ఆరోగ్య జాగ్రత్తలను అందరూ కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







