'సామాజిక రిఫ్రిజిరేటర్' : ఎర్నాకులం
- March 25, 2016
పేదల ఆకలి తీర్చేందుకు కొచ్చిలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న ప్రయత్నం చేసింది. 'పాప్పడవడ' అనే రెస్టారెంట్ యాజమాన్యం 420 లీటర్ల సామర్థ్యంగల సామాజిక రిఫ్రిజిరేటర్(ఫ్రీజ్)ను కొచ్చి పట్టణంలోని కాలూర్ బస్టాండులో ఏర్పాటుచేసింది. ఇందులో పాప్పడవడ రెస్టారెంట్ యాజమాన్యం ప్రతిరోజూ 50 ఆహార పొట్లాలను ఉంచుతుంది. అవసరమైన వారు వాటిని తీసుకొని ఆరగించవచ్చు. అంతేగాక ఆహారం మిగిలితే ఎవరైనా అందులో ఉంచవచ్చు.ఈ రిఫ్రిజిరేటర్ భద్రత కోసం సీసీ టీవీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పాప్పడవడ రెస్టారెంట్ యజమాని మిను పాలిన్ పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్ కయ్యే విద్యుత్తు ఖర్చును తామే భరించనున్నట్లు తెలిపారు. ఇందులో ఆహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







