ఈడోరకం- ఆడోరకం మూవీ ఆడియో ఫంక్షన్..
- March 25, 2016
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ ట్రెండ్ మరింతగా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ ప్రయోగాలకు సై అంటున్నారు. అయితే ఇటీవల మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో జి.నాగేశ్వర్ రెడ్డి ఈడోరకం- ఆడోరకం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారిక నటిస్తుండగా, రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్ జత కట్టింది. ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించి సినిమాకు మంచి ప్రమోషన్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈడోరకం- ఆడోరకం చిత్రంకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా మార్చి 26న ఈ చిత్ర ఆడియో వేడుక జరపాలని యూనిట్ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







