ఈ శుక్రవారం యూఏఈ చరిత్రలో నిలిచిపోనుంది..
- January 07, 2022
యూఏఈ: యూఏఈ ఇటీవల కొత్త వీకెండ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్న యూఏఈ దేశం.. వారంలో కేవలం నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయించింది.ఇంతకు ముందు శుక్ర, శనివారాల్లో వీకెండ్‌గా ఉంటే.. ఇప్పుడు రెండున్నర రోజుల(శని, ఆదివారాలతో పాటు శుక్రవారం హాఫ్ డే) వారాంతపు సెలవుగా ప్రకటించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు వారాంతపు సెలవుగా ఉన్న శుక్రవారం.. కొత్త వీకెండ్ కారణంగా తొలిసారి పని దినంగా మారింది. దీంతో యూఏఈలో ఈ శుక్రవారం(నేడు) తొలి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఇదిలా ఉంటే.. పని ప్రాంతాల నుంచి దూరంగా ఉన్నవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి శుక్రవారం రోజున వర్క్ ఫ్రమ్‌హోంతో పాటు పని వేళల్లో కూడా వెసులుబాటు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు(8గంటలు) పని గంటలు. అదే శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు(నాలుగున్నర గంటలు) మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







