ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
- January 08, 2022
న్యూ ఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) శనివారం గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (పంజాబ్ 117, గోవా 40, మణిపూర్ 60, ఉత్తర్ ప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70). ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర కరోనా ఉధృతి నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఈ రాష్ట్రాల్లో 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జరిగిచ్చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







