అనేక ప్రాంతాలలో వర్ష సూచనలు

- January 09, 2022 , by Maagulf
అనేక ప్రాంతాలలో వర్ష సూచనలు

రియాద్: కింగ్డమ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆదివారం నుండి మంగళవారం వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ ప్రజలను హెచ్చరించింది. మక్కా, రియాద్, అసిర్, హైల్, తబుక్, అల్-బాహాతో సహా రాజ్యంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సివిల్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం, ఫ్లాష్‌ఫ్లడ్‌లకు అవకాశం ఉంది. మదీనా, తూర్పు ప్రావిన్స్ వంటి ప్రాంతాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షం,చురుకైన గాలుల వీస్తాయి. వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని, చెరువులకు దూరంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com