కువైట్ లో క్వారంటైన్ విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన
- January 09, 2022
కువైట్ సిటీ: కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ క్వారంటైన్ విషయమై తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకోని వారికి వేర్వేరుగా క్వారంటైన్ పీరియడ్ ఉండాలనేది ఆ దేశ మంత్రిమండలి ఆలోచన. ఈ మేరకు తాజాగా భేటీ అయిన కేబినేట్ ప్రధానంగా క్వారంటైన్ విషయమై కీలక చర్చలు జరిపింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు వైరస్ బారిన పడితే 7 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుందని ప్రతిపాదించింది. అలాగే కేవలం ఒక్క డోసు టీకా తీసుకున్నవారితో పాటు అసలు వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే 14 రోజుల క్వారంటైన్ ఉంటాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై తర్వాతి కేబినేట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







