నైజీరియాలో 140 మందిని హతమార్చిన బందిపోట్లు
- January 09, 2022
నైజీరియాలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. ఈ వారం రోజుల్లో పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని ప్రభుత్వం తెలిపింది. బందిపోట్ల దాడుల్లో హత్యకు గురైన 140 మందిని తాము పాతిపెట్టినట్లు జంఫారా రాష్ట్రంలోని బాధిత గ్రామానికి చెందిన ఒక సంఘం నాయకుడు బలరాబే అల్హాజీ తెలిపారు.
బుధవారం నుండి గురువారం వరకు అంకా, బుక్కుయుమ్ జిల్లాల్లోని పది గ్రామాల్లో మోటారు బైక్‌లపై వచ్చిన వందలాది ముష్కరులు విధ్వంసానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నివాసితులను కాల్చివేసి, దోపిడికి పాల్పడ్డారని, ఇళ్లను తగులబెట్టారని వాపోయారు. పది గ్రామాల పరిధిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తున్నామని, మృతుల సంఖ్య ఇంకా తేలలేదని స్థానికులు తెలిపారు.
మరోవైపు వాయువ్య, సెంట్రల్ నైజీరియాలో కొన్నేళ్లుగా క్రిమినల్ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయి. హింసాకాండ ఇటీవల మరింతగా పెరిగింది. కాగా, ఇలాంటి దారుణాలకు పాల్పడే బందిపోట్లను ఉగ్రవాదులుగా నైజీరియా ప్రభుత్వం ముద్ర వేసింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







