ప్రభుత్వ ఉద్యోగులు సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే 10 రోజుల జీతాలు కట్

- January 12, 2022 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులు సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే 10 రోజుల జీతాలు కట్

యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం కోసం ఉల్లంఘించేవారికి జరీమానాలు ప్రకటించారు. ఈ మేరకు 8 కోవిడ్ సేఫ్టీ ఉల్లంఘనల వివరాల్ని కార్యాలయాలకు సంబంధించి విడుదల చేశారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, సహచరులతో కరచాలనం చేయడం, ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం వంటివి ఇందులో వున్నాయి. ఉల్లంఘనకు పాల్పడితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే మాత్రం బేసిక్ సేలరీ నుంచి కోతలు విధిస్తారు. మూడు రోజుల వరకు కోత విధించే అవకాశం వుంది వేతనంలో. కోవిడ్ వున్నా, కార్యాలయానికి వస్తే మూడు రోజుల జీతం కట్ చేస్తారు. ఉల్లంఘన పునరావృతమైతే ఐదు రోజుల వేతనానికి కోత వేస్తారు. మూడోసారి తప్పు చేస్తే 10 రోజుల వేతనాన్ని కట్ చేయడం జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com