ఏపీ కరోనా అప్డేట్

- January 12, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు..ఇవాళ మరోసారి పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 3000 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,87,879 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్‌తో ఎలాంటి మరణాలు సంభవించలేదు.ఇక కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10, 119 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 281 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 63, 255 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,17,08,637 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా, ఈ రోజు విశాఖలో అత్యధికంగా 695 కేసులు, చిత్తూరులో 607 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. జనవరి 1వ తేది వరకు రోజుకు 176 కేసులు నమోదయ్యాయి. కానీ ఈ పదిరోజుల్లో ఒక్కసారిగా కేసులు నమోదయ్యాయి. మరో వైపు సంక్రాంతి పండుగ ఉండటంతో చాలా మంది హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల నుంచి స్వంత ఇళ్లకు చేరుకుంటున్నారు. కాగా దీంతో పండుగ తర్వాత కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరో వైపు ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూను సైతం పండగ అనంతరం అమలు చేయనుంది. ఈ లోపులో ఎన్ని కేసులు పెరుగుతాయనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. వైద్యాఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com