సౌదీ డకార్ ర్యాలీ విజేతలు ఖతార్, బ్రిటన్
- January 16, 2022
ఖతార్: శుక్రవారం జెడ్డాలో జరిగిన సౌదీ డకార్ ర్యాలీ లో నాసర్ అల్-అత్తియా తన నాల్గవ డకార్ ర్యాలీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. కొత్త సంవత్సరం రోజున నిర్వహించిన మొదటి స్టేజ్ నుంచి అతను ఆధిక్యం సాధిస్తున్న విషయం తెలిసిందే. అల్-అత్తియా తన సమీప ప్రత్యర్థి సెబాస్టియన్ లోబ్‌ను 12వ రౌండ్ లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ తేడాతో ఓడించాడు. ఓవరాల్ గా మొత్తం 27 నిమిషాల కంటే ఎక్కువ ఆధిక్యంతో విజయం సాధించాడు. అలాగే బ్రిటీష్ రైడర్ సామ్ సుందర్‌లాండ్ తన రెండవ డాకర్ మోటార్‌బైక్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. స్టేజీ విన్నర్ చిలీకి చెందిన పాబ్లో క్వింటానిల్లాను 3 1/2 నిమిషాల తేడాతో ఓడించాడు. ఇది 1994 నుండి అత్యంత సమీప మార్జిన్ కావడం విశేషం.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







