జలుబు, జ్వరానికి చెక్ పెట్టండిలా!

- January 16, 2022 , by Maagulf
జలుబు, జ్వరానికి చెక్ పెట్టండిలా!

చలికాలంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చలికాలంలో ఎక్కువగా బాధించేది జలుబే. అది మెల్లగా దగ్గుతో మొదలై.. జ్వరానికి దారితీస్తుంది. కొత్త నీళ్లు తాగినా, ఆహార అలవాట్లలో మార్పులు చేసినా కూడా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

వింటర్ సీజన్ లో ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చలికాలంలో ఎక్కువగా బాధించేది జలుబే. అది మెల్లగా దగ్గుతో మొదలై.. జ్వరానికి దారితీస్తుంది. కొత్త నీళ్లు తాగినా, ఆహార అలవాట్లలో మార్పులు చేసినా కూడా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్ని పిల్లల్లో అయితే మరి ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. వారిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా చిన్నారులను శీతాకాల వ్యాధులు బాధిస్తుంటాయి. ఇక పెద్దవారిలో అయితే మామూలే. సాధారణ జలుబే కదా? అని నిర్ణక్ష్యం చేయకూడదంటున్నారు వైద్య నిపుణులు. ఇమ్యూనిటీ(వ్యాధి నిరోధక శక్తి) తక్కువ ఉన్నవారిలో కూడా జలుబు, ఫ్లూ ఎక్కువగా వస్తుంటాయి. జలుబుతో మొదలయ్యే ఫ్లూ కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

జలుబు రాగానే వెంటనే ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు. ప్రారంభంలోనే కొన్ని రెమెడీలు పాటిస్తే జలుబు, జ్వరాల బారినపడకుండా జాగ్రత్త పడొచ్చు. ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. ఇంట్లో కిచెన్ లో వాడే ఔషధ గుణాలున్న ఇన్ గ్రీడియంట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సహాజ సిద్ధంగా దొరికే ఈ ఔషధ గుణాలున్న వీటిని తీసుకుంటే దెబ్బకు జలుబు, దగ్గు, జ్వరం క్షణాల్లో పారిపోవాల్సిందేనట. కిచెన్ ఇన్ గ్రీడియంట్స్ లో అల్లం, యాలకులు జలుబు, దగ్గు, జ్వరానికి అద్భుతంగా పనిచేస్తాయి.ఇంట్లోనే తయారు చేసుకొనే సులభమైన చిట్కాలు.. 

అల్లం, యాలకుల టీ 
ఇంట్లో కిచెన్ లో దొరికే వాటిలో అల్లం, యాలకులు ద్రవ్యాలు. అల్లం, యాలకులు కలిపి టీ తయారుచేసుకొని తాగితే జలుబు, ఫ్లూ లక్షణాలను వెంటనే తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో అల్లం అద్భుత ఔషధంగా పిలుస్తారు. అల్లం రసంతో టీ తయారు చేసి సేవించడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. 

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అల్లం ముక్కలు రెండు తీసుకోవాలి. దాల్చిన చెక్క, రెండు యాలకులను తీసుకొని బాగా దంచి మిశ్రమాన్ని తీయాలి. ఒక కప్ వేడినీటిలో టీస్పూన్ మిశ్రమాన్ని కలిపాలి. 10 నిమిషాల పాటు నానబెట్టాలి. చల్లగా అయిన తరువాత టీ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చొప్పున సేవిస్తు ఉంటే మంచి ఉపశమనం కలుగుతుంది. 

అల్లం, దాల్చిన చెక్క, నిమ్మ ఆకు టీ
నిమ్మకాయ ఆకులు యాంటి బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిర్మూలించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. తరచూ బాధించే జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులను కూడా తగ్గించడంలో దిట్ట. 

తయారీ విధానం..
ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్ వేడినీళ్లు తీసుకోండి. ఒక వంతు దాల్చిన చెక్క, రెండు వంతులు నిమ్మకాయ ఆకులు, ఒక వంతు అల్లం తీసుకోండి. వీటిని కలిపి వేడినీటిలో 8 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టండి. టేస్ట్ కోసం టీ తాగే ముందు తేనె కలిపి తీసుకోండి. 

బేసన్ కా షీరా 
బేసన్ కా షీరా.. ఎన్నో ఏళ్ల నుంచి అనాధిగా వస్తున్న సంప్రదాయం. బేసన్ కా షీరా టీ.. జలుబును మటుమాయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని అందరికి తెలుసు. ముక్కు నుంచి నీరు గారుతున్నట్టయితే బేసన్ కా షీరా అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది. బేసన్.. ముక్కులో మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి యాంటి యాక్సిండెట్స్ తో నింపడంలో సహకరిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com