కాంతుల 'సంక్రాంతి'

- January 16, 2022 , by Maagulf
కాంతుల \'సంక్రాంతి\'

తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల పండుగ 
ధనుర్మాసారంభం ఆధ్యాత్మికత సమైక్యత పండుగ 
పల్లెలన్ని మురిసి మెరిసిపోయే నిండైన  పండుగ 
చలిపులికి వెరవక భానుడి వెలుగులు గోచరించకముందే ముంగిళ్ళలో రంగురంగుల రంగవల్లులతో భూమాతని అతివలు ముస్తాబుచేసి గొబ్బెమ్మలు తంగేడు పూలతో అలంకరించి  గుమ్మాలకి మామిడితోరణాల శోభనొసగి  
ముద్దుగారే ముద్దబంతులు ఆహ్వానం పలికే పండుగ 
భగభగమండే భోగభాగ్యాలతో చెడుని తరిమికొట్టి
మంచికోరుతు చిన్నారులని దీవించె భోగిపండ్ల పండుగ
కొత్త పంటరాకతో కళకళలాడే రైతన్నల ఆశలకి
సేద్యంలో తోడైన గోమాతని పూజించే పండుగ 
నోరూరించే ఘమఘమలు పిండివంటల పండుగ 
కొత్త ధాన్యంతో పొంగిపోయే పొంగళ్ళు పండుగ 
మదిమదిలో ఉప్పొంగే ఆనంద పరవళ్ల పండుగ 
అంబరాన్నంటే పతంగులు ఎగురవేయు పండుగ 
పసుపు కుంకుమలు  ఇచ్చిపుచ్చుకునే పండుగ 
నూతనవస్త్ర ధారణతో ఇంటిల్లిపాదీ మురిసే పండుగ
చిన్నపెద్ద బంధువులతో ఉరుకుల పరుగుల కేరింతలతో 
కొత్త అల్లుళ్ళ రాకతో బావమరదళ్ళు ఆటపాటలతో 
కోలాటాలతో కోలాహలంగా సాగిపోయే పండుగ 
హరిదాసు బసవన్న ఆటపాటల కోడిపందాల పండుగ  
ఏటేటా నవ్యక్రాంతులు మోసుకొచ్ఛే కొత్త సంక్రాంతి 
తెలుగు భాష తియ్యదనం గొప్పదనం తెలుసుకున్న 
ప్రతి తెలుగువారు మన వారసత్వం నిలుపుకుంటూ శాంతి సౌభాగ్యాలతో కొత్త వెలుగులు నింపాలని కోరుకునే పండుగ తెలుగువారి పండుగగా అవతరించింది మకరసంక్రాంతి.  

--యామిని కొళ్లూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com