ప్రపంచ ఛాంపియన్‌కు షాక్.. సత్తా చాటిన లక్ష్య సేన్
- January 16, 2022
న్యూ ఢిల్లీ: భారత ఓపెన్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ సత్తా చాటాడు. 2022, జనవరి 16వ తేదీ ఆదివారం ఇండియా ఓపెన్ – 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూతో లక్ష్య సేన్ తలపడ్డాడు. ఆద్యంత ఉత్కంఠగా ఈ పోటీ జరిగింది. ఇరువురు పాయింట్లు సాధించడానికి హోరాహోరీగా తలపడ్డారు.
మ్యాచ్ ఎవరి వైపు మళ్లుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే లక్ష్య సేన్ మాత్రం గురి తప్పకుండబా షాట్లు కొడుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు 24-22, 21-17 తేడాతో విజయం సాధించాడు. మూడో భారత పురుష ఆటగాడిగా నిలిచాడు అంతకముందు…ఈ టైటిల్ ను ప్రకాష్ పదుకొణె (1981), కిదాంబి శ్రీకాంత్ (2015) తొలి సూపర్ 500 ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నారు.
మెరుగైన ఆటతీరును కనబరిచిన లక్ష్య సేన్ ను పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. కేవలం 54 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం విశేషం. మరోవైపు…పురుషుల డబుల్స్ టైటిల్ ను సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్ టైటిల్ మాత్రం థాయిలాండ్ వశం చేసుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







