తెలంగాణ కరోనా అప్డేట్
- January 16, 2022
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. తెలంగాణలో వస్తున్న కేసుల కంటే రికవరీ రేటు అద్భుతంగా ఉంది. ఇక తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 55,883 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,047 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,057కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,013 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,83,104కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,048 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 3,06,29,520 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1174,రంగారెడ్డి140,మేడ్చెల్ 175 కేసులు నమోదయ్యాయి.
అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పెంచడంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









