తిరుమల తిరుపతి లో ఉచిత వివాహాలు
- March 27, 2016
తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. త్వరలోనే కళ్యాణం పథకాన్ని ప్రారంభిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. కళ్యాణం పథకం కింద ఉచిత వివాహాలు జరిపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహం చేసుకునేందుకు పురోహితులకు రూ.500, మేళానికి రూ.300, వీడియో తీసుకుంటే విద్యుత్తు ఛార్జీలకు రూ.60 వసూలు చేస్తున్నారని, ఇకపై వీటిని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు నూతన వధూవరులను సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారని, ఇకపై రూ.300 శీఘ్రదర్శనం క్యూలైన్లో ఉచితంగా దర్శనానికి పంపుతామని వెల్లడించారు. తిరుమల కల్యాణవేదికలో సంవత్సరం పొడవునా వివాహాలు జరుగుతున్నాయని, మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు రోజుకు 250కి పైగా జంటలు ఒక్కటవుతున్నాయన్నారు.వివాహం చేసుకున్న నూతన జంటలకు పసుపు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పది చిన్న లడ్డూలు అందజేస్తామన్నారు. వివాహాల తేదీని బుక్ చేసుకునేందుకు వీలుగా త్వరగా ఆన్లైన్ ఆప్లికేషన్ను రూపొందించాలని అధికారులను ఈవో ఆదేశించారు. కల్యాణవేదిక ప్రాంగణంలో ప్రభుత్వ వివాహ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి వివాహం జరిగిన అరగంటలోపే ధ్రువీకరణ పత్రం అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









