దిల్లీ చేరుకున్నపాకిస్థాన్‌ దర్యాప్తు బృందం

- March 27, 2016 , by Maagulf
దిల్లీ చేరుకున్నపాకిస్థాన్‌ దర్యాప్తు బృందం

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ నిమిత్తం పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం ఆదివారం దిల్లీ చేరుకుంది. ఐఎస్‌ఐ ప్రతినిధులతో సహా, మిలిటరీ ఇంటెలిజెన్స్‌, పోలీస్‌ శాఖల ప్రతినిధులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందం ఈ విచారణ చేపట్టనుంది. మార్చి 29న ఈ బృందం పఠాన్‌కోట్‌లో పర్యటించనుంది.పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్‌ తాహిర్‌ రాయ్‌ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టనుంది. అయితే దర్యాప్తులో భాగంగా ఈ బృందం కేవలం ప్రత్యక్ష సాక్షులను మాత్రమే కలిసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.జాతీయ భద్రతాదళం, సరిహద్దు భద్రతాదళం సిబ్బందిని వీరు విచారించకూడదు. అంతేగాక, పఠాన్‌కోట్‌లోని కీలక ప్రాంతాల్లోకి కూడా వీరిని అనుమతించడంలేదు. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్‌లో దర్యాప్తు జరపడం ఇదే తొలిసారి.పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌లో జనవరి 2న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. జైష్‌-ఎ-మహ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చారు. కాగా.. ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో ఏడుగురు భద్రతాసిబ్బంది అమరులయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com