తీవ్రవాద కార్యకలాపాల్ని సహించేది లేదన్న సౌదీ అరేబియా
- January 18, 2022
రియాద్: సౌదీ అరేబియా, తీవ్రవాద ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తామని ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ హౌతీ తీవ్రవాదుల దుశ్చర్యల్ని సహించేది లేదనీ, గట్టి గుణపాఠం చెబుతూనే వుంటామని స్పష్టం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇటీవల జరిగిన హౌతీ దాడిని తీవ్రంగా ఖండించింది సౌదీ అరేబియా. యెమెనీ పార్టీలతో కలిసి శాంతి కోసం చాలా ప్రయత్నాలు చేసినా హౌతీ మిలీషియా మాత్రం తన పంథా వీడటంలేదని సౌదీ అరేబియా అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్‌లోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా హౌతీ మిలీషియా తీరు మారుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కలిసికట్టుగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వుందన్నారాయన.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







