పాల్మైరా సిరియా స్వాధీనం..
- March 27, 2016
రష్యా దళాల సహాయంతో సిరియా సైన్యం పాల్మైరా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనతో ఐసిస్ మీద సిరియా చెప్పుకోదగ్గ విజయం సాధించినట్లయింది.సిరియాలో ప్రముఖ పురాతన నగరంగా పేరొందిన పాల్మైరాను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. అలాంటి ఈ నగరాన్ని గత ఏడాది మేలో ఐసిస్ స్వాధీనం చేసుకుని పలు వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసింది.ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోడానికి గత కొద్దిరోజులుగా జరుగుతున్న యుద్ధంలో సిరియా తరఫున 188 మంది రక్షణ సిబ్బంది ప్రాణాలొదిలారు.ఐసిన్ 400 మందిని కోల్పోయింది. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో ఐసిస్ అమర్చిన బాంబులను, మందుపాతరలను నిర్వీర్యం చేసే పనిలో సిరియా సైన్యం నిమగ్నమైంది. వారసత్వ కట్టడాలున్న ప్రాంతంతో పాటు పౌర నివాస ప్రాంతం కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని సిరియా తెలిపింది.ఐసిస్ ఆధ్వర్యంలో ఉన్న మరో నగరం మోసూల్ని కూడా త్వరలో స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం ప్రారంభించినట్లు ఇరాక్ సైన్యం గత గురువారం ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









