'ఊపిరి' భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది..
- March 27, 2016
అక్కినేని నాగార్జున, కార్తి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం 'ఊపిరి'. 'ఊపిరి' మూవీని చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక మంచి మూవీగా చెప్పుకుంటూ వస్తున్నారు. 'ఊపిరి' మూవీ రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకూ ఈ మూవీకి మౌత్ టాక్ పాజిటివ్ గా మారింది. అయితే ఇప్పటి వరకూ 'ఊపిరి' భారీ కలెక్షన్స్ దిశగా దూసుపోతుంది. ఒక్క డొమెస్టిక్ మార్కెట్ లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. ముఖ్యంగా యూఎస్ లో 'ఊపిరి' సినిమాకి మంచి ప్రేక్షక ఆధరణ దక్కిందని అంటున్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఈ మూవీ ఓవర్సీస్ లో దాదాపు $300K పైగా వసూళ్లను సాధించిందని అంటున్నారు.ఇంతటితో ఆగకుండా థియోటర్స్ ని సైతం ఇప్పుడు పెంచుతున్నారు. ఫ్రెంచ్ సినిమా 'ఇన్ టచబుల్స్' నుండి ప్రేరణ పొందిన కథగా 'ఊపిరి' మూవీ తెరకెక్కింది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని అంటున్నారు. మూల కథని ఏ మాత్రం పాడు చేయకుండా, 'ఊపిరి' మూవీని తెరకెక్కించిన విధానం దర్శకుడి ప్రతిభని చూపిస్తుందని అంటున్నారు. ఒక్క ఓవర్సీస్ లోనే కాకుండా, డొమెస్టిక్ మార్కెట్ లో ఈ మూవీ 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ మూవీపై ఎక్కడా నెగిటివ్ టాక్స్ రాకపోవటంతో, ఇది ఈ మూవీకి ప్లస్ గా మారింది. అందుకే 'ఊపిరి' మూవీ బాక్సాపీస్ వద్ద ఓ ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది. తెలుగులోనూ ఈ మూవీకి థియోటర్స్ ని పెంచే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా మల్టీస్క్రీన్స్ లో ఈ మూవీకి కలెక్షన్స్ భారీ వస్తున్నాయని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







