ఒమాన్ 'సిఎంవైయఫ్' వారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన మెగా రక్తదాన కార్యక్రమం!

- March 27, 2016 , by Maagulf

రక్తదాతలకు పాదాభివందనాలు

                శుక్రవారం జరిగిన మెగా రక్తదాన శిభిరం ఉహించిన దానికన్నా మెగా ఫ్యామిలీ అభిమానులు, ఉదారవాదులు, సామాజిక బాధ్యత ఉన్నవాళ్లు మరీ ముఖ్యముగా మా CMYF టీం ను ప్రేమించి ఆదరించి మాపైనున్న విశ్వాసముతో సుమారు "మూడు వందలు" పైగా ఔత్సాహికులు రక్తదానానికి వచ్చారు అంటే మా అందరుకు అంతకన్నా ఆనందము మరొకటి వుండదు.

               మెగా పవర్ స్టార్ "రామ్ చరణ్" జన్మ దినం సందర్భముగా మెగా లెవెల్ లో తలపెట్టిన రక్తదాన శిభిరము వైభవముగా ఎక్కువమంది ఉత్సాహముగా పాల్గొన్నందుకు మీ అందరుకు పేరుపేరునా పాదాభివందనము తెలుపుతున్నాము.

               మండుటెండలను లెక్కచేయక.....దూరభావమును కూడా పక్క్కన పెట్టి వందల కిలో మీటర్లనుంచి వచ్చి రక్త దాన శిభిరములో పాల్గొని మీ సామజిక బాధ్యతను మరోసారి నిర్వర్తించారు.

               ఉదయము 8 గంటలకు మొదలైన రక్త దాన శిభిరము సాయంకాలము 5 గంటల వరకు నిర్విఘ్నముగా జరిగినందుకు CMYF కార్య కర్తలకు ఆనందము అవధులు దాటింది అని చెప్పాలి. అద్భుతముగా "రక్తపు చుక్క" ఆకారములో చేసిన కేక్ ను సీనియర్ మెగా అభిమాని సివిల్ ఇంజినీయర్ అయిన వెంగల భాస్కర్ (సిరిసిల్ల-కరీంనగర్-తెలంగాణా) తల్లి గారు అయిన "వెంగల కాన్తవ్వ" గారు "రామ్ చరణ్" ను మనసారా ఆశీర్వదించి కేక్  కట్ చేసి వేడుకను జయప్రదం చేసారు.

               రక్తదాతలందరుకూ  మున్నెన్నడు లేని విధంగా "Dry Fruits" & దూరము నుంచి వచ్చిన వారకు భోజన సదుపాయము చేసి కొత్త వోరవడికి CMYF నాంది పలికింది. మస్కట్ నగరములో (ఒమాన్ దేశములో) మంచి కార్యాలు చేయాలన్న "చిరు మెగా యూత్ ఫోర్స్" అని నిరూపించారు. రక్తదాతలందరు కూ చిరంజీవి గారు పంపిన సెర్తిఫికెట్లు ప్రదానము చేసారు.
 
               మరొక్కసారి తెలుగువారందరుకూ విన్నపమూ ... మీరు కూడా ఉదారముతొ ముందుకు వచ్చి మరిన్ని సేవ కార్యక్రమాలకు మమ్ములను ప్రోత్సహిస్తారని ప్రార్ధన.

 

రక్తదాతలందరుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము 

మీ (మా) చిరు మెగా యూత్ ఫోర్స్, మస్కట్ - ఒమాన్

          

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com