అగ్ని ప్రమాదం నుంచి ముగ్గురిని రక్షించిన బృందాలు

- January 21, 2022 , by Maagulf
అగ్ని ప్రమాదం నుంచి ముగ్గురిని రక్షించిన బృందాలు

మస్కట్: గురువారం తెల్లవారుజామున అమెరత్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి ముగ్గురు వ్యక్తులను రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. సమాచారం అందగానే మస్కట్ CDAA, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసాయని, ఈ ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులను రక్షించామని, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని CDAA తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com