పాకిస్థాన్‌ వ్యక్తికి మరణశిక్ష విధించిన సౌదీ అధికారులు !

- March 27, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ వ్యక్తికి మరణశిక్ష విధించిన సౌదీ అధికారులు !

ఓ మహిళను దోపిడీ చేసి, హత్య చేసిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణశిక్ష విధించారు. దీంతో ఈ ఏడాది ఆ దేశంలో మరణశిక్షకు గురైన వారి సంఖ్య 79కి చేరింది. వివరాల్లోకి వెళితే..జెద్దాలోని రెడ్‌సీ నగరంలో బంగ్లాదేశ్‌కు చెందిన హజార్‌ హుస్సేన్‌ అనే మహిళను దోపీడి చేసి, హత్య చేశారు. ఈ కేసులో పాక్‌కు చెందిన ఎలియాస్‌ ఇస్మాయిల్‌ అనే వ్యక్తి దోషిగా గుర్తించి మరణశిక్ష విధించారు అక్కడి అధికారులు. దీంతో ఆదివారం ఇస్మాయిల్‌కు ఈ శిక్షను అమలుచేశారు. సౌదీ అరేబియాలో 2016లో ఇప్పటివరకు 79మందికి మరణశిక్ష అమలుచేయగా. ఒక్క జనవరి 2 రోజునే 47మందికి శిక్ష అమలు చేశారు. 2015లో అక్కడ 153 మందికి మరణశిక్ష అమలుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com