డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పైలట్
- January 21, 2022
సౌదీ అరేబియా: పని వేళలను ఉద్యోగులు సీరియస్ గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపే ఘటన ఇది.షిఫ్ట్ టైం ముగిశాక.. ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పే ఘటన ఇది. ఒక విమాన పైలట్ అనూహ్య నిర్ణయం ప్రయాణికులకు శాపంగా మారిన ఘటన ఇది. తన డ్యూటీ టైం ముగిసిందంటు ఓ పైలట్ విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన ఆ పైలట్, విమాన ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.
వివరాల్లోకి వెళితే PIAకు చెందిన PK-9754 విమానం జనవరి 16న రియాద్ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో వాతావరణం సహకరించక విమానాన్ని దమ్మామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. తిరిగి ప్రయాణం కొనసాగించాల్సిన సమయానికి పైలట్ లలో ఒకరు తన షిఫ్ట్ టైం ముగిసిందని, విమానం నడిపేందుకు రాలేనని తాపీగా హోటల్ కు వెళ్ళిపోయాడు.దీంతో కంగుతిన్న కో-పైలట్ విషయాన్నీ PIA యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు.
ఇంతలో విమానంలోని ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం దిగబోమని, తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిందే అంటూ పట్టుబట్టారు.పరిస్థితి చేయిదాటి పోతుండడంతో విమానాశ్రయం సెక్యూరిటీ అప్రమత్తం అయి.. ప్రయాణికులకు సర్ది చెప్పారు. అనంతరం వారందరికీ స్థానిక హోటల్ లో బస ఏర్పటుచేసి, పైలట్ తిరిగి వచ్చాక ప్రయాణం కొనసాగించారు.దీనిపై PIA సంస్థ ప్రతినిధి స్పందిస్తూ..పైలట్లకు విశ్రాంతి ఎంతో అవసరమని, తమ పైలట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వెనకేసుకొచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







