నిరాటంకంగా 50వ రోజుకు చేరుకున్న ఘంటసాల స్వరరాగ మహాయాగం

- January 22, 2022 , by Maagulf
నిరాటంకంగా  50వ రోజుకు చేరుకున్న ఘంటసాల స్వరరాగ మహాయాగం

హైదరాబాద్: 'ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్', 'శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్', 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా','వంశీ ఇంటర్నేషనల్" మరియు 'శుభోదయం గ్రూప్స్' సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించబడుతున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం నిరాటంకంగా 50వ రోజుకు చేరుకుంది. 

2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, అమెరికా మొదలైన దేశాలనుండి గాయనీగాయకులు పాల్గొని ఘంటసాల వారి గీతాలను ఆలపించారు. 

50వ రోజు సందర్భంగా శిరోమణి డా.వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విజయనగరం నుండి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుండి శైలజామూర్తి ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను ఎన్నుకుని ఆలపించారు.  రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా , సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com